శ్రీకాకుళం జిల్లా : మందస మండలం సాబకోట సచివాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ సవర లోకనాథం హౌసింగ్ బిల్లుల శాంక్షన్ కొరకు రూ.5000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కారు. హౌసింగ్ బిల్లుల కోసం పలుమార్లు సచివాలయాలు చుట్టూ ప్రదక్షిణలు చేసిన పని జరగలేదు. దీంతో విసుగు చెందిన సింగపురం గ్రామ గిరిజనుడు నిమ్మన పరుశురాం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు
