మహబూబాబాద్: ఎంతో కష్టపడితే కానీ ప్రభుత్వ ఉద్యోగం రాదు. అలాంటి ఉద్యోగంను కష్టపడి సంపాదించి అందరిలో తమకంటూ మంచి పేరు సంపాదించుకుంటారు.సమాజంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న డిమాండ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఒక మంచి ఉద్యోగం సాధించి కొందరు చేసే తప్పుడు పనుల వల్ల సమాజంలో అవహేళనకు గురౌతారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. సబ్ రిజిస్ట్రర్ తస్లీమా మహమ్మద్ పరిచయం అక్కర్లేని ప్రభుత్వ ఉన్నతాధికారి. ఆమె సోషల్ మీడియాద్వారా ఎంతో ఫెమస్ అయ్యారు.
ప్రతి ఆదివారం వ్యవసాయం పనులకు వెళ్లేవారు. ఇలా సంపాదించిన డబ్బులతో సామాజిక సేవకార్యక్రమాలు చేసేవారు. అంతే కాకుండా..సర్వర్ అనే చారిటబుల్ ట్రస్ట్ ను సైతం ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో పేదలకు సహాయం చేస్తూ, ఆతర్వాత మూగజీవాలకు ఆహారం పెడుతూ ఎంతో ఫెమస్ అయ్యారు. అంతే కాకుండా ఏకంగా మంత్రి సీతక్కతో కూడా చనువుగా ఉండేవారు. మంత్రి సీతక్క ఈమెని చెల్లిలాగా భావించేవారు.
అలాంటి మంచి పేరున్న అధికారిణి ఈరోజున ఏసీబీకి దొరికిపోయారు. ఈ సంఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. తస్లీమా నస్రీన్ మహమ్మద్ రూ 19,200 లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వాటితో పాటు డాక్యుమెంట్ రైటర్ల నుంచి రూ. 1,78,000 తీసుకున్న అమౌంట్ ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
దీంతో అధికారులు ప్రస్తుతం తస్లీమా ఆఫీసు, ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆమె నడుపుతున్న సర్వర్ అనే స్వచ్ఛంద సంస్థకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి.. ఆమె బ్యాంక్ అకౌంట్లు, అన్నింటిపై పోలీసులు విచారణచేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో ఫెమస్ అయిన తస్లీమా ఇలాంటి పని చేయడం పట్ల, ఇతర అధికారులు, ఆమె ఫాలోవర్స్, రాజకీయ నేతలు సైతం ఆశ్చర్యపోతున్నారు