కరీంనగర్ జిల్లా: శంకరపట్నం డిప్యూటీ తాసిల్దార్ రూ. ఆరు వేల లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి దగ్గర నుంచి నాలా కన్వర్షన్ కోసం అనుమతులు కోరగా మల్లేశం లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితులు చేసేది ఏమీ లేక ఏసీబీ అధికారులను స్పందించారు. ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తాసిల్దార్ మల్లేశంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
