జగిత్యాల జిల్లా, ధర్మపురి : ధర్మపురి మున్సిపల్ కమిషనర్ కందుకూరి శ్రీనివాస్ లంచం పుచ్చుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కారు. బుధవారం నాడు కోరుట్ల ఎస్సై శంకర్ లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన మరువకముందే ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరు మహేశ్ నుండి రూ. 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి పట్టుకున్నారు. రెగ్యులర్ వేతనం కోసం రూ 20,000 మహేష్ నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
