చిత్తూరు జిల్లా, పుంగనూరు : రైతు నుంచి లంచం తీసుకుంటూ సదుం తహశీల్దార్ మారుఫ్ హుస్సేన్, వీఆర్వో మహబూబ్ బాషా పట్టుబడినట్లు ఏసీబీ ఏఎస్పీ విమల కుమారి, డీఎస్పీ జెస్సీ ప్రశాంతి శనివారం తెలిపారు. మండలంలోని రైతు షఫీ ఉల్లాకు చెందిన భూమి అసైన్మెంట్ భూమిగా రావడంతో దానిని తిరిగి సెటిల్మెంట్ చేసేందుకు వారు లంచం డిమాండ్ చేసినట్లు వారు వెల్లడించారు. నగదు తీసుకుంటూ పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు
