లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగజ్యోతి ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ. 15 కోట్ల ఆస్తులను గుర్తించినట్లుగా తెలిపారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటు నాలుగు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఆమె పేరిట ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు ఎసిబి అధికారులు తేల్చారు.
ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) పని చేస్తున్న జ్యోతి బిల్డింగ్ కాంట్రాక్టర్ నుండి రూ. 84 వేలు లంచం తీసుకుంటూ సోమవారం ఎసిబి కి చిక్కారు. కాగా, జ్యోతిని ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించే క్రమంలో ఛాతిలో నొప్పి వస్తుందంటూ చెప్పడంతో ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగ ఉన్నట్లు తెలిపారు. రేపు డీఛార్జి అనంతరం జాగా జ్యోతిని కోర్టులో హాజరుపరచనున్నారు ఎసిబి అధికారులు.
నిజామాబాద్ జిల్లా నామ్దేవ్ వాడకు చెందిన కాంట్రాక్టర్ బోడుగం గంగన్నగాజులరామారం లోని జువెనల్ బాయ్స్ హాస్టల్ బిల్డింగ్ పనులు చేయించాడు. ఇందుకు సంబంధించిన బిల్లు కోసం వెళితే రూ. 84 వేలు లంచం జాగా జ్యోతి డిమాండ్ చేయగా దీంతో బాధితుడు ఏసిబి ని ఆశ్రయించాడు. ముందస్తు ప్లాన్ ప్రకారమే ఏసిబి అధికారులు ఆమెని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.