వినుకొండ:- మండలం అందుగుల కొత్తపాలెం గ్రామానికి చెందిన ఏ.కోటేశ్వరావు తన పోలానికి నీరు పెట్టేందుకు విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ కావాలని విద్యుత్ శాఖ సిబ్బంది కి దరఖాస్తు పెట్టుకోగా సబ్ ఇంజనీర్ బనావత్ రామాంజనేయులు నాయక్, 80,000/- డిమాండ్ చేసి, ముందుగా అరవైవేలు రూపాయలు కనెక్షన్ ఇచ్చిన తర్వాత మిగతా 20,000/- రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసాడని దీంతో రైతు కోటేశ్వరరావు ఏసీబీ అధికారులను అశ్రయించాడని, మంగళవారం ఉదయం వినుకొండ మండలం చీకటిగలపాలెంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో రైతు నుంచి సబ్ ఇంజనీర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడిలో ఏసీబీ అడిషనల్ యస్పీ మహేంద్ర ముత్తే, ఏసీబీ డీఎస్పీలు ప్రతాప్, సత్యానందం, ఇన్స్పెక్టర్స్ రవిబాబు, నాగరాజు,లక్ష్మారెడ్డి, మన్మధరావు, అంజిబాబు,సురేష్, సబ్ ఇన్ స్పెక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
