- బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 10 వేలు కావాలని గ్రామస్థుడు వెంకటేశ్వర్లు ను డిమాండ్ చేసిన VRO మాల్యాద్రి
నెల్లూరు జిల్లా..ఆత్మకూరు: ఆత్మకూరు మండలం దేపూరు విఆర్ఓ మాల్యాద్రి గ్రామస్తుడు వెంకటేశ్వర్లు వద్ద నుండి 10 వేలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. రావెళ్ల వెంకటేశ్వర్లు అనే రైతు నుండి తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే 10,000 వేల రూపాయల లంచం ఇవ్వాలని VRO మాల్యాద్రి డిమాండ్ చేయగా వెంకటేశ్వర్లు ACB అధికారులను సంప్రదించి ఈ రోజు పట్టణంలోని ఓ బ్యాంకు సమీపంలో 10 వేలు VRO కి ఇస్తూ వుండగా ACB అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ రైడ్ లో ఏసీబీ అధికారి ఆంజనేయులు రెడ్డి వారి బృందం పాల్గొన్నారు…..