- లంచం డిమాండ్ చేసిన ఐసీడీఎస్ సూపర్ వైజర్ ని పట్టుకున్న ఎసిబి అధికారులు
కృష్ణా జిల్లా అవనిగడ్డ: అవనిగడ్డ ఐసిడిఎస్ కార్యాలయం పై ఏసీబీ అధికారుల దాడి చేసారు. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మోపిదేవి ఐసీడీఎస్ సూపర్ వైజర్ పద్మావతి. మోపిదేవి మండలం పెదకల్లేపల్లి -2 అంగన్ వాడి హెల్పర్ పరిశే లావణ్యకు సర్టిఫికెట్ ఇవ్వడం కోసం రూ.10 వేలు డిమాండ్ చేయడం వలన లావణ్య ఏసిబిని అధికారులను ఆశ్రయించింది. ఎసిబి డిఎస్పీ బి.శ్రీనివాస్ నేతృత్వంలో 20 మంది సిబ్బంది వలవేసి సూపర్ వైజర్ పద్మావతిని పట్టుకున్నారు.