కడప జిల్లా:మండల కేంద్రమైన పెండ్లిమర్రి ఆరోగ్య కేంద్రంలో హెల్త్ సూపర్వైజర్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ ఆర్ఎంపీల వద్దనుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.గతంలో పెండ్లిమర్రి మండలంలో పత్రికలో వచ్చిన కథనాలపై జిల్లా వైద్య శాఖ అధికారులు తనిఖీ చేసి కొన్ని ప్రథమచికిత్స కేంద్రాలను సీజ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని అడ్డుగా పెట్టుకుని హెల్త్ సూపర్వైజర్ రమేష్ గతంలో కూడా మండలంలోని ఆర్ఎంపీల వద్ద మామూళ్లు వసూలు చేశారని విమర్శలు కూడా ఉన్నాయి. కొంత మంది ఆర్ఎంపీ వైద్యులను పిలిపించి లంచం తీసుకుంటుండగా సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది.