మంచిర్యాల జిల్లా,చెన్నూర్ మండలంలోని కొమ్మెర గ్రామం లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి లోడింగ్ కొరకు వచ్చి అదుపుతప్పి గోడను ఢీకొనడంతో డ్రైవర్ మృతి చెందడం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ధాన్యం లోడింగ్ లో భాగంగా డ్రైవర్ లారీని ధాన్యం వద్దకు తీసుకువచ్చే క్రమంలో అద్భుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న ఉపాధి హామీ ప్రచార గోడను ఢీకొనే సమయంలో డ్రైవర్ క్యాబిన్ నుండి దూ కడంతో లారీ కిందపడి మృతి చెందాడు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.