- కోతకు వచ్చిన వరిపొలంలోకి దిగి కోళ్ల కోసం ఎగబడ్డ స్థానికులు…
మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామ శివారులో కోళ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహానం బోల్తా పడింది. అతివేగంతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి బోల్తా కొట్టింది. దీంతో కోళ్లు రోడ్డుపై పడిపోయాయి. దీన్ని గమనించిన స్థానికులు కోళ్ల కోసం ఎగబడ్డారు. బొలెరో వాహనం బోల్తా పడటంతో కొన్ని కోళ్లు రోడ్డు పక్కనే ఉన్న వరిపొలంలో పడ్డాయి. స్థానికులు, వాహనదారులు వాటిని కూడా వదల్లేదు. కోతకు వచ్చిన వరిలోకి కోళ్ల కోసం దిగారు. పోటీ పడి.. కోళ్లను పట్టుకున్నారు. కొందరైతే రెండు చేతుల్లో మూడ్నాలుగు కోళ్లను ఎత్తుకెళ్లారు.