- పోలీసులు శ్రమించినా ఫలితం లేదు..
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం జాతీయ రహదారిలో ఉన్న బషీర్ ఖాన్ పెట్రోల్ పంపులో పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు పడి మృతి చెందారు. హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం పెట్రోల్ టాంక్ క్లీన్ చేయడానికి కడప నుంచి ముగ్గురిని ఇక్కడికి పంపడం జరిగింది. ఈ క్రమంలో ఒక వ్యక్తి కిందికి దిగి క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు టాంక్ లో పడిపోవడం జరిగింది. అనంతరం అతన్ని కాపాడే క్రమంలో మిగతా ఇద్దరు పడిపోయారు.. అగ్నిమాపక దళం, పోలీసులు శ్రమించి ఒకరిని పైకి లాగి హుటాహుటిన ఆస్పత్రికి పంపడం జరిగింది. అతను కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. రెస్క్యూ టీము, పోలీసులు శ్రమించి మిగతా ఇద్దరినీ బయటకు తీసినా వారు కూడా మృతి చెందడం జరిగింది. ఈ సంఘటనపై బషీర్ ఖాన్ పెట్రోల్ బంక్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.