- నరసరావుపేటతో నాకు చాలా అనుబంధం ఉంది
- నరసరావుపేట మా అమ్మ పుట్టినిల్లు
- సినీ నటులు నరేష్ విజయ్ కృష్ణ
- నరసరావుపేట కేంద్రంగా న్యూమాన్స్ కుంగుపు ఆర్గనైజేషన్ కార్యకలాపాలు నేడు ఎన్ ఈ సి లో ప్రారంభం కానున్నాయి
పల్నాడు జిల్లా నరసరావుపేట: నేటి సమాజంలో మహిళలకు, యువతులకు కుంగ్ ఫు, కరాటే, శిలంబం నేర్చుకోవడం చాలా ముఖ్యమని న్యూ మాక్స్ కుంగ్ ఫు అసోసియేషన్ జాతీయ గౌరవాధ్యక్షులు, సినీ నటులు నరేష్ విజయ్ కృష్ణ అన్నారు. న్యూ మాక్స్ కుంగ్ ఫు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల సౌజన్యంతో సౌత్ ఇండియా ఛాంపియన్ షిప్ కుంగ్ ఫు, శిలంబు, భరతనాట్యంలను ప్రారంభోత్సవం కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా స్థానిక ఏ1 ఫంక్షన్ హాల్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేష్ మాట్లాడారు. ప్రపంచంలోని ఏ దేశంలో మార్షల్ ఆర్ట్స్ యూనివర్సిటీ లేదన్నారు. మొట్ట మొదటిసారిగా ఇండియాలో స్థాపించాలనే పట్టుదలతో ఫౌండర్ మరియు గ్రాండ్ మాస్టర్ రవికుమార్, జాతీయ అధ్యక్షుడు రాజా శిఖామణి ప్రోద్బలంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. జాతీయస్థాయిలో సంస్థ కార్యకలాపాలను ఉత్తర, దక్షిణ భారతదేశంలో ఆరు రాష్ట్రాలలో విస్తరించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా స్థాయిలో ఈ ప్రాంతంలో సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి మహిళలకు, యువతకు, పోలీస్ ఫోర్సెస్ కు అవగాహన కల్పించడం, శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఎన్ఐసి కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
నరసరావుపేట మా అమ్మ పుట్టినిల్లు :
నరసరావుపేట మా అమ్మ విజయనిర్మల పుట్టినిల్లని, నా సొంత ఊరు అని నరేష్ తెలిపారు. ఇక్కడ నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా ఉన్నాయన్నారు. నరసరావుపేట అంటే ముందుగా గుర్తొచ్చేది రాజా గారి కోట అన్నారు. తన చిన్నతనంలో ఇక్కడ మిరపకాయ బజ్జి, గోలి సోడా బాగా ఫేమస్ అన్నారు. మా అమ్మ జ్ఞాపకార్థం పట్టణంలో శిలావిగ్రహం ఏర్పాటు చేయాలని ఉందన్నారు.