అదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలో మంగళవారం ఆర్టీసీ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. రెప్పపాటులో లారీ, ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటన నుంచి బయటపడ్డాయి. నేరడిగొండ మండలం బందం వద్ద రోడ్డు క్రాస్ చేసేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయత్నించారు. అదే సమయంలో అటువైపు నుంచి వేగంగా లారీ దూసు కొచ్చింది. లారీ డ్రైవర్ చాకచక్యంగా లారీని కంట్రో ల్ చేశాడు. అయినప్పటికీ బస్సు వెనక బాగాన కొద్దిగా లారీ ఢీకొట్టింది.
బస్సులో 30 మంది ప్రయా ణికులు ఉన్నారు. రెప్ప పాటులో ఘోర ప్రమాదం తప్పడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అటు వైపు నుంచి లారీ చాలా వేగంగా వచ్చింది. ఇంతలో రోడ్డు క్రాస్ చేసేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయత్నించాడు.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://www.thereportertv.com/wp-content/uploads/2024/08/%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%80%E0%B0%B8%E0%B1%80-%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%81-%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%98%E0%B1%8B%E0%B0%B0-%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82-.-Viral-Video.mp4?_=1పొరపాటున బస్సు ముందు భాగాన్ని లారీ ఢీకొట్టి ఉంటే.. ఘోర ప్రమాదం జరిగేదని, బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయేవారని, బస్సు లోని ప్రయాణికులు చెబుతున్నారు.అయితే, లారీ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. లారీని కంట్రోల్ చేస్తూ పక్కకి తిప్పాడు. దాంతో ఘోర ప్రమాదం తప్పిందని అన్నారు..
ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముందు నుంచి ఓ లారీ అతి వేగంగా వస్తున్నా.. బస్సు డ్రైవర్ పట్టించుకోలేదు. రోడ్డుని క్రాస్ చేసేయాలి అనే తొందరతో బస్సుని అలాగే ముందుకు పోనిచ్చాడు.
అయితే, ప్రమాదాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ బస్సుని తప్పిస్తూ లారీని పక్కకి తిప్పాడు. దాంతో ఘోర ప్రమాదమే తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాం టి గాయాలు కాకపోవడంతో బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.