contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Adilabad- PM Modi: కుటుంబ పార్టీలను నమ్మకండి : ప్రధాని మోడీ

ఆదిలాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ లో పర్యటిస్తున్నారు. ఉదయం ఆదిలాబాద్ కు చేరుకున్న ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, మంత్రి సీతక్క, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సాదరంగా స్వాగతం పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారి రాష్ట్రానికి వచ్చిన ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శాలువాకప్పి సన్మానించారు. అనంతరం అండర్ డ్రైనేజీ నిర్మాణం సహా 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ – బేల – మహారాష్ట్ర రోడ్డు విస్తరణ పనులను, రైల్వే విద్యుదీకరణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. రామగుండం NTPC ని జాతికి అంకితం చేశారు.

ఈ సందర్భంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రామగుండంలో యూరియా కంపెనీని మోదీ ప్రారంభించారని తెలిపారు. అలాగే వరంగల్ లో వ్యాగన్ తయారీ కంపెనీకి శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.30 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, తెలంగాణ నుంచి 4 వందేభారత్ రైళ్లను ప్రారంభించారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. NTPCకి విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు. 80 శాతం విద్యుత్ ను తెలంగాణకే ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రధానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకుంటే నష్టపోయేది ప్రజలేనని తెలిపారు. అలాగే రాష్ట్రంలో స్కై వే లకు అనుమతి, టెక్స్ టైల్ పార్క్ మంజూరు చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రంతో కావాలని కయ్యం కోరుకోమని, స్నేహపూర్వకంగా ఉంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. 5 మిలియన్ల ఎకానమీ లక్ష్యంలో హైదరాబాద్ కూడా భాగస్వామ్యమవుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్దన్నలా సహకరించాలని కోరారు.

రాష్ట్ర విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లు ఉంటే.. ఇప్పటివరకూ 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించగలిగామని, మిగతా విద్యుత్ సాధనకూ కేంద్రం సహకరించాలని కోరారు. అలాగే ఆదిలాబాద్ కు నీళ్లివ్వాలంటే తుమ్మిడిహట్టిని నిర్మించాలని, దీనికోసం భూ సేకరణ చేపట్టాలన్నారు. అందుకు కావాల్సిన పరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్న సీఎం.. దీనికి కేంద్రం సహకరించాలని కోరారు.

ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. తెలంగాణ కుటుంబానికి నా నమస్కారాలు అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఇదొక కొత్త అధ్యాయమన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి, కేంద్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి పదేళ్లు పూర్తయిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేంద్ర సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలే నిదర్శనమని పేర్కొన్నారు. అన్నిరంగాల్లోనూ రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రూ.56 వేల కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ సెకండ్ యూనిట్ తో తెలంగాణ విద్యుత్ అవసరాలు తీరుతాయని, 800 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుందన్నారు.

తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్న మోదీ.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదని, ఇప్పుడు జరుగుతున్నది ఎన్నికల సభ కాదన్నారు. దేశంలో ప్రగతి ఉత్సవాలు జరుగుతున్నాయని, దానికోసమే నేడు తెలంగాణకు వచ్చినట్లు తెలిపారు. 15 రోజుల్లో దేశంలో 2 ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ ను ప్రారంభించామని తెలిపారు. బీజేపీ హయాంలో ఆదివాసి మహిళ రాష్ట్రపతి అయ్యారు. ఆదివాసీలను బీజేపీ సర్కార్ గౌరవిస్తుందనేందుకు ఇదే నిదర్శనమన్నారు. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్.. కుటుంబ పార్టీలను నమ్ముకోకండి అని మోదీ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండ్డూ ఒక్కటేనని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ తప్పుచేసిందన్న కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలోనూ ప్రజలకు ఏమీ జరగదన్నారు. మోదీ గ్యారెంటీ ఇస్తే.. అది ఖచ్చితంగా జరుగుతుందన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :