contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

“ఆదిపురుష్” చూడాలనుకునేవారికి బంపర్ ఆఫర్

  • 3డీ టికెట్ ప్రారంభ ధర రూ. 150కి తగ్గింపు
  • ఈరోజు, రేపు అందుబాటులో ప్రత్యేక ఆఫర్
  • ఏపీ, తెలంగాణల్లో ఆఫర్ లేదని ప్రకటించిన మేకర్స్

భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం డివైడ్ టాక్ తెచ్చున్నప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. మరోవైపు ఈ చిత్రాన్ని 3డీలో వీక్షించాలనుకునే వారికి బంపరాఫర్ ప్రకటించారు. అందరికీ అందుబాటులో ఉండే టికెట్ ప్రారంభ ధరను రూ. 150 చేశారు. అయితే 3డీ గ్లాసెస్ కు మాత్రం అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఈ ఆఫర్ మన తెలుగు రాష్ట్రాలకు లేకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. ఈ ఆఫర్ ను వినియోగించుకునే వారు బుక్ మై షో ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని ఈ చిత్రాన్ని నిర్మించిన టీసిరీస్ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈనెల 22, 23న మాత్రమే ఉంటుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :