అల్లూరి జిల్లా, అనంతగిరి: ఆంధ్రప్రదేశ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలా తీరుచూస్తుంటే భయమేస్తుందని ఒకవైపు హక్కులు కాలరస్తున్నారని మరోవైపు చట్టాలను తుంగలో తొక్కేస్తున్నారని సరైన సమయం లో ఆదివాసీ సమాజానికి మేలుకొల్పాల్సిన గురుత్తర బాధ్యత ఆదివాసీ యువ లాయర్ లు అడ్వాకెట్ ల చేతిలో ఉందని భారత్ ఆదివాసీ పార్టీ వర్కింగ్ పెసిడెంట్ డాక్టర్. పి రామకృష్ణ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..ఆదివాసీలకు బ్రహస్త్రం, అగ్నిస్త్రం వంటి పెస 1996,అటవీహక్కుల చట్టం 2005,1/1970, వంటి వి ఇప్పటికి పక్కడబందిగా సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదన్నారు, ఇంతటి పవర్ ఫుల్ చట్టాలు ఉన్నప్పటికీ ఇప్పటికే సగం ఆదివాసీ ప్రాంత భూములు గిరిజనేతరుల చేతిలో బంది అయ్యి ఉన్నాయని ఆరోపించారు, గ్రామసభ తీర్మానలే సుప్రీం పవర్ ఉన్నప్పటికి పెస సక్రమంగా అమలులో లేదని ఇవ్వన్నీ ఆదివాసీ ప్రాంతాలలో ప్రజలకు తెలియజేసి జాతిని, జాతి సంపదను, హక్కులను చట్టాలను కాపాడుకోవడానికి మీ న్యాయశాస్త్రం ద్వారానే సాధ్యమని అన్నారు,సామరస్య హక్కులు,చట్టాలు,పోరాటాలు ఒకవైపు చేస్తూనే మరోవైపు న్యాయపోరాటలకు సిద్ధం చేయాల్సిన బాధ్యత ఆదివాసీ మేధావి సమాజం మీద ఉందని పేర్కొన్నారు,ఇన్నాళ్లు అగ్రవర్ణ పార్టీ ల నీడలో ఉన్న కొంతమంది ఆదివాసీ అడవి తల్లి అనే చెట్టు కొమ్మలనే నరకలనుకునే జాతి ద్రోహులు నుండి కూడా ఆదివాసీ సమాజాన్ని మేలుకొల్పసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు, మన హక్కులు, మన చట్టాల కోసం మాట్లాడని వాడు మనవాడే అయినా మనకు ద్రోహియే అని స్పష్టం చేసారు,చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు జాతి పేరు చెప్పి జాతి ఉనికినే ప్రమాదం లో పడేసే ఆదివాసీ ద్రోహులను కూడా గుర్తించి వారిని తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం ఎంతైయినా ఉందని అన్నారు,ఆదివాసీ మేధావి సమాజమా ముందు మీరు కీలు బొమ్మలు వలే ఆడడం మానేయండి జాతిని జాగృతం చేయండని హితవుపలికారు, ఆదివాసీ యువ లాయర్లకు మీరు బలంగా పోరాడితే మన హక్కులు చట్టాలు కాపాడుకోగలుగుతాం లేకుంటే రేపటి భవిష్యత్ ఆదివాసీ తరాలు ఏమైపోతుందో ఉహించుకుంటేనే భయమేస్తుందని మనవి చేసారు,ఇప్పటికే సరైన ఉపాధి లేక వలసలు పోయి ప్రాణాలు కోల్పోతున్నారని ఒకవైపు భూములు కోల్పోతున్నారని భవిష్యత్ లో ఒక్కప్పుడు ఈ ప్రాంతంలో ఆదివాసీలు ఉండేవారంట అని కధలు చెప్పుకునే స్థాయికి దిగజారిపోతామేమో అని భయంగా ఉందన్నారు,అందుకే లాయర్స్, అడ్వాకెట్స్ మీరు బోర్డర్ లో కాపలా కాస్తున్న సైనికులు వలే జాతిని కాపడాలి సేవలు జాతికి చాలా అవసరం ఉందని తెలిపారు