- జగనన్న భూ – రీ సర్వేలో గిరిజన భూములు గిరిజనేతర లు కు ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలి
- పనసలపాడు గ్రామంలో ఆదివాసి గిరిజనులు ఆందోళన
- జాయింట్ కలెక్టర్ గారు పనసలపాడు భూ సమస్య స్వయంగా విచారణ చేపట్టాలి
అనకాపల్లి జిల్లా : రోలుగుంట మండలం పనసలపాడు రెవెన్యూ పరిధిలో 12 ఆదివాసి గిరిజన భగతా కుటుంబాలు( ST) తన వారసత్వ భూములో వరి. చెరుకు వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో జగనన్న భూ-రీ సర్వేలో నిర్వహించడం జరిగింది. సర్వే సిబ్బందితో దానికి గిరిజనులు కలిపి సర్వే చేయడం జరిగింది.. సర్వేర్లు రైతులు భూమి వివరాలతో పాటు ల్యాండ్ పార్సల్ నెంబర్ ( LPN) రైతులకు అందజేయాలి. సరే పూర్తయిన తర్వాత ( DLR) క్రాఫ్ట్ ల్యాండ్ రిజిస్టర్ రెవిన్యూ గ్రామంలో 9(2) నోటీస్ ఇచ్చి వారి అంగీకర పత్రం సంతకం పెట్టి ఇవ్వాలి. 15 రకాలైనటువంటి రూల్స్ పాటించవలసి ఉంటుంది రెవిన్యూ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎంఆర్ఓ కుమ్మక్కవి గ్రామసభ పెట్టకుండా సర్వే నెంబర్ 8-1. 6-9 లో ఎస్.ఎఫ్.ఏ రికార్డు ప్రకారంగా గిరిజను వేలు మీద ఉంది జగనన్న భూ-రీ సర్వేలో గిరిజనేతరులు మాజీ సర్పంచ్ తమ టాపు సత్యనారాయణ వైసీపీ నాయకుడు. మరియు ఒక నలుగురు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. సర్వేనెంబర్ 6-1లో 10 గిరిజన కుటుంబాలు గత వారసత్వంగా సాగు చేస్తున్నారు. గిరిజనులకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి గిరిజనేతలకు పట్టలు ఇచ్చారు. ఈ విషయంపై నర్సీపట్నం ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గిరిజనేతలకు పట్టాయి భూములను. డిస్ప్లేండ్ గారు నమోదు చేశామని. పట్టాలు గిరిజనేతలకు ఇవ్వలేదని. చెప్తున్నారు. ROR రిజిస్టర్ ప్రకారంగా గిరిజనేతలకు పట్టాలు ఇచ్చినట్టుగా చూపిస్తున్నారు. దక్షనే పట్టాదార్ పాస్ పుస్తకాలు రద్దు చేయాలి. జాయింట్ కలెక్టర్ వారు సమగ్రమైన విచారణ చేపట్టాలి. పట్టాలు ఇచ్చిన రెవెన్యూ అధికారిపై చర్య తీసుకోవాలి ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు. ఆదివాసి గిరిజనులు గేమ్మిల చిన్నబ్బాయి. G మచ్చికొండ. గేమిల ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు