అల్లూరి జిల్లా, హుకుంపేట, ది రిపోర్టర్ : హుకుంపేట మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని గిరిజన హక్కుల పరిరక్షణ దినం గా జరుపుకోవడ మైనదని సంఘం జిల్లా అధ్యక్షులు టి క్రిష్ణరావు ఒక ప్రకటనలో తెలియేశారు. ముందుగా జెండ ఆవిష్కరణ చేపట్టారు.దేశంలో ఆదివాసీలపై దాడుల్ని అరికట్టాలి! గిరిజనుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించాలని, మణిపూర్ ఆదివాసీలపై జరిగే రాజ హింసను అరికట్టాలి! రాజ్యాంగం ద్వారా ఆదివాసుల కు సంక్రమించిన హక్కులు, చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి టి. క్రిష్ణరావు, హైమావతి మాట్లాడుతూ..మణిపూర్ రాష్ట్రం లో ఆదివాసులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనుసన్నల్లో జరుగుతున్న మారణహోమం కారణంగా, ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు జరుపుకొనే ఆగస్ట్ 9 ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని ఆదివాసీ హక్కుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు. “ఆదివాసులు మానవులే” కానీ వారికి దేశంలో కనీస గౌరవం దక్కడం లేదని అన్నారు.ఆదివాసీలు,బడుగు బహీనవర్గాలు తీవ్రమైన వివక్షతలు,హింసలు, ఎదుర్కొంటున్న రన్నారు.
అందులో భాగంగానే మణిపూర్ మారణకాండ అని గుర్తు చేశారు. ఆదివాసులకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు చట్టాలను నిర్వీర్యం చేసి వారి మనుగడను అంతం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదకం ప్రకారం ఆదివాసీలపై దాడులకు తెగబడుతుందన్నారు.మానవ హక్కులను కాలరాస్తు,బిజెపి మనువాద రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తుందని వారు విమర్శించారు.”గిరిజన హక్కులు మానవ హక్కులే”! గిరిజన హక్కుల ఉల్లంగణలపై గిరిజన సమాజం రాజకీయాలకు,కులాలకు మతాలకు అతీతంగా ఐక్య ఉద్యమాలకు కలిసిరావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళ సంఘం నాయకులు హైమావతి గిరిజన సంఘం మండల అధ్యక్షులు సోమన్న, పూర్వ అధ్యక్షులు రామారావు, వి ఆర్ ఎ ల సంఘం మండల అధ్యక్షులు ఎం,మోహన్ రావు, కె రామన్న SFI నాయకులు మరియు విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.
