కారంపూడి: గతంలో ఎన్నో ప్రమాదాల్లో చాలా మంది అంగవైకల్యం, ప్రాణాలు కోల్పోయారు. ఒప్పిచర్ల ఎస్సీ కాలనీ వెనుక ఉన్న పొలాలలో పిల్లలు గురువారం గాలిపటాలు ఎగురవేస్తూ కరెంటు తీగలకి చుట్టడం వల్ల , విద్యుత్ సరఫరా లో సుమారు ఐదు గంటలు అంతరాయం ఏర్పడినది. అందులో పిల్లవాడికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.కావున తల్లిదండ్రులకు తెలియచేయడమేమనగా ఈ సంక్రాంతి హాలిడేస్ కు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని, ఎందుకంటే ఈ హాలిడేస్ లో పిల్లలు గాలిపటాలు ఎగరవేసి అది తెగిపోయి స్తంభాల మీద, మిద్దెల మీద, కరెంటు తీగలు మీద పడుతుంటాయని, అది తీసుకోవడానికి వెళ్లి పిల్లలు విద్యుత్ ప్రమాదాలకు గురవుతారని,దయచేసి పిల్లల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని విద్యుత్ ప్రమాదాల నుండి మీ పిల్లలను కాపాడుకోవాలని, కారంపూడి విద్యుత్ శాఖ ఏఈ సిహెచ్ కోటేశ్వరరావు తెలిపారు.
