రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్టంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలన అద్దం పట్టె విధంగా. పదితలలతో “జగనాసుర అవినీతి నేర రాక్షసుడు ” దిష్టిబొమ్మను యర్రగొండపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చించివేశారు. “జగనాసుర అవినీతి నేర రాక్షసుడు” పోస్టర్ల చించివేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
