అల్లూరి జిల్లా, దేవీ పట్నం: మండలంలో జోరుగా అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోతుంది. ఏజెన్సీ ప్రాంతం నుండి మైదాన ప్రాంతాలకు అక్రమ రేషన్ బియ్యం తరలి వెళ్తుంది….. అయినా అధికారులు మాత్రం చూసి ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నాడని ప్రజల నుంచి గుసగుసలు వినబడుతున్నాయి… వివరాలు ఈ విధంగా ఉంది. శరభవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం జోరుగా కొనసాగిస్తున్నాడు. ఎవరైనా సంబంధించిన వారు పట్టుకుంటే మీకెంత చెప్పండి అనే విధంగా అక్రమ వ్యాపారం జోరుగా నిర్వహిస్తున్నాడు… సుమారు నెలకి 20 రోజులు రేషన్ బియ్యం జోరుగా హెచ్ఎఫ్ డీలక్స్ బండి పైన తరలిస్తున్నాడు. రోజుకొచ్చి శరభవరం నుండి గోకవరం బండిమీద సుమారు 200 కేజీలు బియ్యం పట్టు కెళ్తున్నాడు. రోజుకు 200 కేజీలు చొప్పున 20 రోజులకి 4000 అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నాడు… సుమారు ఆదాయం నెలకు వచ్చి 80 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాడని ప్రజల నుంచి జోరుగా గుసగుసలు వినబడుతున్నాయి. అంతకన్నా ఎక్కువ లోడ్ ఉంటే రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల లోపు ఒక మెగా ఆటో పెట్టుకుని అక్రమ రేషన్ బియ్యం మైదాన ప్రాంతాలకు ఉన్న రైస్ మిల్లులకు తరలిస్తున్నాడు. ఇటువంటి అక్రమ దారుడిని అధికారులు పట్టించుకోకపోవడం గమనాకరం. ప్రజలకు అందవలసిన జగనన్న రేషన్ బియ్యం పక్కదారి పోతుంటే అధికారులకు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు… అక్రమ రేషన్ బియ్యం బండిమీద జోరుగానే తరలించడం జరుగుతుంది. బండి పేరు హెచ్ఎఫ్ డీలక్స్.. ఏపీ 39 బి ఏ ఎం 87 76 గల బండి జోరుగా ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన రైస్ మిల్లులకు రేషన్ బియ్యం తరలి వెళ్తుంది.
• సివిల్ సెటిల్మెంట్లు ఎక్కువ..
అక్రమ రేషన్ బియ్యం తరలించే విషయంలో ఇందుకూరుపేట గ్రామానికి చెందిన ఒక కీలక వ్యక్తి త్వరగా సివిల్ సెటిల్మెంట్ లో ఎక్కువగా జరుగుతున్నాయని సంబంధించిన వారికి ఆ వ్యక్తి ద్వారా గాని డబ్బులు అందజేయడం జరుగుతుందని. జిరాక్స్లకు కూడా నెల నెల అవే ఖర్చులు అక్రమ వ్యాపారస్తులు భరిస్తున్నారని ఇదంతా ఒక గ్రామానికి చెందిన కీలక వ్యక్తి ద్వారా నడుస్తుందని ప్రజల నుండి జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి…
•పట్టుకుంటారా? వదిలేస్తారా?.
మరోపక్క ఏజెన్సీ ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతానికి అక్రమ రేషన్ బియ్యం తరలి వెళ్ళిపోతుంటే సంబంధించిన అధికారులు పట్టుకుంటారా కళ్ళకు గుంతలు కట్టుకుంటారా అనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం ఉంది.