అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం డిఫెన్స్ రిక్రూట్మెంట్ స్కీమ్ కి వ్యతిరేకంగా నిరసన బృందాలు సోమవారం నాడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు హర్యానా, జార్ఖండ్, పంజాబ్, కేరళ రాష్ట్రాలు భద్రతను పెంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా చెలరేగిన విధ్వంసంతో రైల్వే కార్యకలాపాలు దెబ్బతినడంతో సోమవారం 500 రైళ్లకు పైగా రద్దు చేయబడ్డాయి.
భారత్ బంద్ ఎఫెక్ట్ .. 529 రైళ్ళు రద్దు :
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సాగుతున్న భారత్ బంద్ నిరసనల ప్రభావం 539 రైళ్లపై ప్రభావం పడగా, 181 మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 348 ప్యాసింజర్ రైళ్లు సహా 529 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రైల్వే నాలుగు మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా పాక్షికంగా రద్దు చేసింది. భారత్ బంద్ దృష్ట్యా ప్రయాణీకుల భద్రత కోసం, తదుపరి ఆదేశాల వరకు దక్షిణ మధ్య రైల్వేలోని చెన్నై డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్‌లలో ప్లాట్ ఫాం టిక్కెట్ల జారీ పరిమితం చేయబడిందని చెన్నై డివిజన్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఢిల్లీలోని వివిధ రైల్వే స్టేషన్‌లలో 31 రైళ్లు నిలిచిపోయాయి. ఘజియాబాద్‌తో పాటు పంజాబ్ నుండి ముంబైకి వెళ్లే రైలు జూన్ 20న రద్దు చేయబడ్డాయి.
అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న ఆందోళనలు:
కేంద్రం యొక్క అగ్నిపథ్ పథకం అనేది 17.5 మరియు 21 సంవత్సరాల మధ్య వయస్సు గల సైనికులను మూడు సర్వీసులలో నాలుగు సంవత్సరాల కాలానికి రిక్రూట్‌మెంట్ చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత గ్రాట్యుటీ మరియు పెన్షన్ ప్రయోజనాలు లేకుండా 75% మంది అగ్నివీరులకు ఉద్యోగ కాలం ముగుస్తుందని ప్రకటించింది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నేడు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టారు. ఇక నిరసనకారులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.
జార్ఖండ్‌లోని పాఠశాలల మూసివేత .. పంజాబ్ లో సైనిక కోచింగ్ సెంటర్ల వద్ద భద్రత పెంపు:
అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌పై పిలుపునిచ్చిన భారత్ బంద్ దృష్ట్యా ఈరోజు జార్ఖండ్‌లోని పాఠశాలలు మూసివేయబడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి రాజేష్ శర్మ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. మరోవైపు ఈరోజు భారత్ బంద్ దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని పంజాబ్ పోలీసులను ఆదేశించారు. పంజాబ్‌లోని అన్ని పెద్ద సైనిక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల చుట్టూ భద్రతను పెంచాలని కూడా సూచనలు ఇవ్వబడ్డాయి.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారత్ బంద్:
బీహార్, తెలంగాణా రాష్ట్రంతో పాటు కొన్ని రాష్ట్రాలు హింసాత్మక సంఘటనలను నివేదించగా, ప్రభుత్వం యొక్క అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరసనలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.