- హాజరుకానున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ
కరీంనగర్ జిల్లా: రైతుల న్యాయ సహాయార్థం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గన్నేరువరం మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సుజయ్ ల చేతుల మీదుగా గురువారం అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభించనున్నట్లు కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, సభ్యుడు జక్కనపల్లి గణేష్ లు ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల న్యాయ సహాయార్థం, చట్టాలపై అవగాహన, కల్తీల నియంత్రణ, దళారీల నుండి రక్షణకై ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు మరియు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.