కరీంనగర్ జిల్లా: ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, కరీంనగర్, జిల్లా కమిటీ సమావేశం గురువారం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆఫీస్ సమీపంలో కృషి భవన్ లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్ అధ్యక్షతన సమావేశము జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య. సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు,కాంపల్లి సతీష్, కాల్వల రామచంద్రం, హాజరైనారు, ఇప్పటివరకు, జిల్లా అధ్యక్షులుగా వ్యవహరించిన సాంబారి కొమురయ్య కరీంనగర్ జిల్లాలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నిర్మాణం కోసం చేసిన కృషిని తన నివేదికలో వివరించారు, తన పదవీకాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు ఎస్ వరుణ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షులు కాడారం వినయ్ కుమార్ ఆదేశాలు, సూచన మేరకు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్,బొంకూరి మధు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి మహేష్. రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్, కాలువల రామచందర్, సమిష్టి నిర్ణయం తీసుకొని, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామానికి చెందిన అడ్వకేట్ జేరిపోతుల మహేందర్ ని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జేరిపోతుల మహేందర్, కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాలలో గ్రామ గ్రామాన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘాల నిర్మాణం కోసం కృషి చేస్తామని అందుకు అందరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు, తమను నియమించిన జాతీయ రాష్ట్ర కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు, ఈ కార్యక్రమంలో, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు కుంబాల లత,ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు కిష్టయ్య,కొయ్యడ మురళి, తిమ్మాపూర్ సీనియర్ నాయకులు ఎలుకపల్లి తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి గరిగే ప్రభాకర్, చొప్పదండి మండల అధ్యక్షులుకడారి గంగరాజు, కేశవపట్నం మండల అధ్యక్షులు గొట్టే అర్జున్, గంగాధర మండల అధ్యక్షులు తాళ్ల శ్రీనివాస్, చిగురుమామిడి మండలం నుండి బోయిని శ్రీనివాస్,మానకొండూరు మండలం నుండి చిలుముల రాజన్నతో పాటు కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాల నుండి అధిక సంఖ్యలో గ్రామ శాఖ అధ్యక్షులు మండల శాఖ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
