ప్రకాశం జిల్లా / చీమకుర్తి: ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి ఆదేశముల మేరకు చీమకుర్తి బి.ఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో మీకు తెలుసా…? హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని చీమకుర్తి సినార్డ్ (SNIRD ) వారునిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీమకుర్తి సీఐ ఎం సుబ్బారావు పాల్గొన్నారు.
సీఐ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలని, విద్యపై దృష్టి సారించాలని, ముఖ్యంగా స్త్రీలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని, విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.
సినార్డ్ ప్రాజెక్టు మేనేజర్ సునీల్ బాబు మాట్లాడుతూ ఎయిడ్స్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎయిడ్స్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో అందరూ కలసి జీవించాలి అనే అంశాలపై విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఫ్లారెన్స్ , అత్యాల దావీదు, శేఖర్, మహేశ్వరీ,ప్రసన్న , ఇతర కాలేజి సిబ్బంది మరియు సినార్డ్ స్టాఫ్ పాల్గొన్నారు.