తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోఎయిడ్స్ వ్యాధి పట్ల అప్రమత్తతతో మెలగాల్సిన అవసరం ఉందని పాకాల సివిల్ కోర్ట్ న్యాయమూర్తి పూర్ణిమాదేవి అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, ఆర్.సి.సి ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిడ్స్ నియంత్రణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ప్రసంగించారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా యువత తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ ఎ. మొహిద్దీన్ భాష మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన ప్రధాన బాధ్యత యువతపై ఉందన్నారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి రావడానికి గల కారణాలను, నివారణ మార్గాలను, చికిత్స గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రమేష్ కుమార్ ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, ఆర్.సి.సి, అధికారులు ఈశ్వరబాబు, మసులామణి, చిట్టి కళావతి, న్యాయవాదులు సలీం భాష, చంద్రమోహన్, ప్రవీణ్, ప్రకాష్, అనూష అధ్యాపకులు మెడికల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు