శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో రాకపోకలను పునరుద్ధరించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో నిన్న సాంకేతిక సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ సేవలు దెబ్బతిన్నాయి. శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు, విమానయాన సంస్థలు ఆలోచిస్తున్నాయి.
