ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రలోని తాసిల్దార్ కార్యాలయం ముందు మధ్యాహ్నం భోజన వంట కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు, ఐదో వరోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సమ్మెకు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య హాజరై మాట్లాడుతూ తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పదవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం
ఏ కోశాన్న పట్టించుకోవడం లేదు వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యల పరిష్కరించకుంటే 17వ తేదీన ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తామని, 19 నాడు ఎంఈఓలకు. 21 నాడు డిఈఓ ఆఫీస్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులు సమస్యలను పరిష్కరించకుంటే 25వ, తేదీన చలో ప్రగతి భవనం ముట్టడిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం 8 ప్రకారం పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలి. పెండింగ్ బకాయి బిల్లు లను వేతనలు వెంటనే చెల్లించాలి. కార్మికులు అందరికి నియామక పత్రాలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ఇచ్చు విధంగా రోజుకు 600 చెల్లించాలి. వంట సరుకులు అన్ని ప్రభుత్వమే అందించాలని కార్మికుల అందరి కి ఇ న్సూరెన్స్, పీఫ్ ఈఎస్ఐ సామజిక భద్రత కలిపించాలి. కనీస వేతనాలు 26 వేల చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి కాంతల అంజిరెడ్డి, సహాయ కార్యదర్శి చొక్కల శ్రీశైలం, మధ్యాహ్నం భోజన వంట కార్మికుల సంఘం అధ్యక్షురాలు ఇక్కుర్తి విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఏడుమేకల రేణుక, గంగిపల్లి కానుకవ్వ, కుసుమ కవిత, విజయ,కాల్వ రాధ, కంటే సత్తవ్వ,సిపిఐ నాయకులు కూన మల్లయ్య, పబ్బతి సాగర్ రెడ్డి, బోయిని మల్లయ్య, వంట కార్మికులు పాల్గొన్నారు