కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం లోని గునుకుల కొండాపూర్ గ్రామం మోత్కుల్లాపల్లి శివారులో డి 14 పక్కన 30 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వ్యవసాయ బాయిని ఇరిగేషన్ అధికారులు ఈఈ రాములు, డిఈ నందు, నాయక్, గ్రామానికి చెందిన సొల్లు అజయ్ వర్మ రైతు ను వ్యవసాయ బావిని భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమంగా బావులను కూల్చడానికి టిప్పర్లను యంత్రాలను తీసుకొచ్చి నానా బూతులు తిడుతూ బావిని కూల్చడానికి యంత్రాలతో వచ్చారు, అజయ్ వర్మ వ్యవసాయం చేసుకొని జీవించేటువంటి వారిని బావిని కాపాడుకోవడానికి వద్దు సార్ నాకు ఈ పంట అయ్యేంతవరకు సమయం ఇవ్వండి సార్ మీ కాళ్లు ముక్త సార్ మీ దండం పెడతా సార్ అంటే వినకుండా నన్ను ఇష్టమొచ్చినట్లు తిడుతూ ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో ఏం పీక్కుంటావో పీక్కోనని పోలీస్ సపోర్ట్ తోని నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ నన్ను కొట్టే ప్రయత్నం చేస్తే నేను ఆత్మహత్య చేసుకుని బావిలో దూకి చనిపోతానని బావిలో దూకడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి రైతులు నన్ను ఆత్మహత్య చేసుకోకుండా కాపాడినారు, వెంటనే పోలీసు వాళ్ళు రేపు మార్నింగ్ పోలీస్ స్టేషన్కు రండి ఏదైనా ఉంటే మాట్లాడి బావిని కూల్చడాన్ని ఈరోజు ఆపమని పోలీస్ అధికారులు చెప్పిన వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోయారు. అయ్యా నేను పేద దళితున్ని వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాను నాయొక్క బావి ప్రమాదాలకు గాని రోడ్డుకు దగ్గర గాని ఉన్నట్టయితే నేనే నా బావిని కూల్చివేస్తాను కానీ నాకు నష్టం చేయాలని ఇరిగేషన్ అధికారులు కక్షపూరితంగా మా బావిని కూల్చడానికి ఈరోజు యంత్రాలతో టిప్పర్ల ద్వారా వచ్చి నా బావి ని రాత్రికి రాత్రే కూల్ చేస్తానని బెదిరిస్తూ ఇరిగేషన్ అధికారులు వెళ్లిపోయారు, నాబావి కూల్చినట్టయితే నేను ఆత్మహత్య శరణ్యం నాకు జీవనోపాధి ఏం లేకుండా పోతుంది కనీసం ప్రభుత్వ యంత్రాంగం నన్ను ఆదుకొని నా బావిని కాపాడాలని దయతో మిమ్మల్ని కోరుతున్నాను,అంటూ ఒక సెల్ఫీ వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ చేశాడు, ఇరిగేషన్ అధికారులు కనీసం కనికరించి నా భావిని కాపాడుతారని లేదంటే నా చావుకు కారకులవుతారు దయచేసి నా బావి నుండి నన్ను కాపాడాలని దయతో ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతున్నాను ఇక్కడ కొంతమంది రైతులకు కూడా అనగాల సరోజన అనగా కమల అనే గళ్ళ భూమయ్య అనే రైతులకు కూడా నష్టపరిహారం ఇవ్వకుండానే కెనాల్ తీయడం జరిగింది ఆ రైతులను కూడా ఆదుకొని వారికి నష్టపరిహారం అందించాలి సెల్ఫీ వీడియోలో కోరారు.
