- అకాల వర్షంతో నష్టపోయిన మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని పార్వతిపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి జే వెంకట్రావు వినతిపత్రం బుధవారం ఇవ్వడం జరిగింది.
- వినతి పత్రం ఇచ్చిన అనంతరం వెంటనే డిఆర్ఓ వెంకట్రావు స్పందించి వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కి కలవమని చెప్పడం జరిగింది,అనంతరం వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద ఉన్న జిల్లా సహాయ వ్యవసాయ శాఖ అధికారి ఆర్ శ్రీనివాసరావు ను కలవడం జరిగింది.
అల్లూరి జిల్లా : అనంతరం జిల్లా సహాయ వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు కొమరాడ మండల వ్యవసాయ శాఖ అధికారి శంకర్ రావుతో ఫోన్లో మాట్లాడి వెంటనే మొక్కజొన్న పంటను పరిశీలించి నివేదిక జిల్లా కార్యాలయానికి పంపమని చెప్పడం జరిగింది.
అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నుండి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులకు కొల్లి సాంబమూర్తి మరియు రైతులు బి. నారాయణరావు మాట్లాడుతూ…. గడిచిన కొన్ని రోజులుగా సాయంత్రం వేళ కురిసిన అకాల వర్షాలు వల్ల కొమరాడ మండలం కల్లికోట గ్రామానికి చెందిన రైతులు యొక్క మొక్కజొన్న పూర్తిగా నీటిలో మునిగి చిన్న చిన్న మొలకెత్తే పరిస్తితి ఉందని ఇలాంటి సందర్భంలో పండిన పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం చాలా అన్యాయమని అధికారులు అడిగితే మరి కొనుగోలు చేయమని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఇంత జరుగుతున్న ఈ ఏరియాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయకపోవడం చాలా అన్యాయమని అలాగే గతంలో 100 కేజీల మొక్కజొన్నను రూ.2100 రూపాయి గాను సివిని కోపరేటివ్ బ్యాంకు ద్వారా కొనుగోలు చేయడం జరిగిందని అయితే గడిచిన రెండు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కొనుగోలు చేయకపోవడం చాలా అన్యాయమని దీనివల్ల మధ్య దళారులు తమ ఇష్టం వచ్చిన రేటుకు రైతుల వద్ద మొక్కజొన్న కొనుగోలు చేసే పరిస్థితి ఉందని దీనివల్ల రైతులు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని కావున వెంటనే రైతులు వద్దన్న మొక్కజొన్న ప్రతి గింజను గిట్టిబాటు ధరకు కొనుగోలు చేసి రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలని ఈ విధంగా పార్వతీపురం మన్యం జిల్లా డిఆర్ఓ ని ఈరోజు అనగా బుధవారం కలడం జరిగిందని రెండు మూడు రోజుల్లో గాని మొక్కజొన్న రైతులకు అన్ని విధాలుగా వారం రోజుల్లోపు ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రైతుల అందరితో కలిసి ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో రైతులు త్రినాధ లక్ష్మణరావు పాల్గొన్నారు.