అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలంలో మంజూరైన ఏకలవ్య పాఠశాల నిర్మాణం కొరకు భూమి పరిశీలించిన ప్రాజెక్ట్ సెంట్రల్ కమిషనర్ భితిన్ చంద్ర రతున్. మండల కేంద్రంలోనీ మట్టుజోరు పంచాయితీ నక్కల పుట్టు గ్రామం వద్ద స్థానిక రెవెన్యూ అధికారులు సేకరించిన 11 ఎకరాల భూమిని తహశీలదారు రాజ్య లక్ష్మి కమిషనర్ కు చూపించారు.గిరిజన ప్రజలు స్వచ్ఛందంగా భూమి సేకరించారనీ కమిషనర్ కు తెలియజేశారు.భూమి పరిశీలించిన కమిషనర్ రతన్ సంతృప్తి వ్యక్తం చేశారు. సందర్భంగా భూమి దానం చేసిన గిరిజన రైతులు మాట్లాడుతూ ప్రాజెక్ట్ కోసం భూదానం చేసిన వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనీ కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు.వారు సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా అందరికీ న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామన్నారు. వీటిపై ఐటిడిఎ ప్రాజెక్టు అధికారితో చర్చిస్తానని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజ్యలక్ష్మి,స్థానిక సర్పంచ్ సాంబ, తాడిగిరి సర్పంచ్ రంజిత్ కుమార్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు టి క్రిష్ణ రావు,మండల సర్వేయర్,పాడేరు బాలికల ఎ పి అర్ కళాశాల సిబ్బంది ఏకలవ్య సిబ్బంది స్థానిక వి ఆర్ ఓ ,భు యజమానులు పోయా రాజారావు తదితరులు పాల్గొన్నారు.