అల్లూరి సీతారామరాజు జిల్లా – పాడేరు : జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం రెండవ దశ భూముల రీ సర్వే ఈనెల 25 నుండి ప్రారంభమవుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి 22 మండలాల రెవెన్యూ అధికారులతో సోమ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్సైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ, రీసర్వే, పివిటిజి ఓటరు నమోదు, ఫారం 6బి, ఫారం 7 సేకరణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లో ఫారం బి 6 సేకరణ పూర్తి చేయాలని పేర్కొన్నారు. డి పట్టా భూముల సేకరణపై ఎస్సైన్డ్ కమిటీకి, జిల్లా ఇన్చార్జి మంత్రికి నివేదించాలని సూచించారు. ఎస్సైన్డ్ భూములకు పట్టాలు పంపిణీ చేయడానికి పట్టాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఫైనల్ రికార్డ్సు ఆఫ్ రైట్స్, ఫారం 13 నోటిఫికేషన్ జారీ, వెక్టరైజేషన్ నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసి లక్ష్యాలను సాధించాలని స్పష్టం చేసారు. రీ సర్వే, మ్యుటేషన్లు, డి. పట్టా భూముల సేకరణపై తాహశీల్దారులు దృష్టిపెట్టాలన్నారు.భూ సమస్యలపై ఫిర్యాదులు వస్తే ఆర్ ఐ స్థాయి అధికారిని విచారణాధికారిగా నియమించాలని అన్నారు. లబ్దిదారునితో మాట్లాడి విచారణ నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జెకెసి పోర్టల్ ను తాహశీల్దారులు నిరంతరం పరిశీలించాలని చెప్పారు. వంద గ్రామాల్లో ఫైనల్ ఆర్ ఓ ఆర్ పూర్తి దీసారని అన్నారు. 142 గ్రామాల్లో ఫారం 13 నోటిఫికేషన్ పూర్తి చేసారని మిగిలిన గ్రామాల్లో నిర్దేశించిన సమయానికి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. స్పందన సమస్యల పరిష్కారానికి అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, పాడేరు ఐటిడిఏ పిఓ వి. అభిషేక్, రంపచోడవరం పిఓ సూరజ్ గనోరి, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డి ఆర్ ఓ పి. అంబేద్కర్, 22 వుండలాల తాహశీల్దారులు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
