ప్రభుత్వాలు, పాలకులు మారినా గ్రామాల స్థితిగతులు మారడం లేదు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం బాగుండాలి. కాని నేటికీ మారుమూల గ్రామాలకు రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఫలితంగా జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారులు సరిగా లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్త వీధి మండలంలోని జర్రెల పంచాయతీకి చెందిన జర్రెల కొత్తూరు గ్రామంనికి రహదారి కోసం అధికారులు నాయకులు చుట్టూ కాళ్ళు అరికగేలా తిరిగిన రహదారి మాత్రం మంజూరు చేయడంలో అధికారులు, నాయకులు విఫలమయ్యారు.పేపర్లో రాగానే తూతూ మంత్రంగా కాంట్రాక్టర్ వస్తారు మొదలెట్టినట్టుగా నటించి వెళ్తారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా గ్రామాల స్థితిగతులు మారడం లేదు. ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా ఆ గ్రామానికి రోడ్డు సౌకర్యం బాగుండాలి. కాని నేటికీ మారుమూల గ్రామాలకు రోడ్డు నిర్మాణం కలగానే మిగిలిపోయింది. ఫలితంగా జిల్లాలోని పలు గ్రామాల్లో రహదారులు సరిగా లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ బురమయంగా మారి గుంతలు పడి ప్రయాణం చేయడానికి నరకయాతన పడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. బురద రోడ్లపై వాహనాలు దెబ్బతినడం, గుంతల్లో ఇరుక్కుపోవడం, అత్యవసర సమయాల్లో 108 అంబులెన్స్‌లు సైతం రాలేని దుస్థితి నెలకొంటుంది. దీంతో ఏకంగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కావాలంటూ గ్రామస్తులు కాలినడకన వెళ్లి అధికారులకు విన్నవించుకున్నారు. .
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
సరైన రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ఏండ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్లు బాగా లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అత్యవసర సమయాల్లో 108 వాహనం వచ్చే పరిస్థితి లేక ఎడ్లబండి లో వైద్యం కోసం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
- వార్డ్ మెంబెర్ పోత్తూరు విష్ణుమూర్తి, గ్రామస్తులు జర్త రాజారావు,చిన్నబ్బాయి,జర్రిల కొత్తూరు
మా గ్రామం నుంచి మండల కేంద్రానికి వెళ్లాలంటే రోడ్లు లేవు. ఎన్నికల సమయంలో ఎంతో మంది రోడ్లు వేయిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు రోడ్లు వేయలేదు. దవాఖానాకు వెళ్లాలంటే అరిగోస పడుతున్నాం. ఆటోలు, ఇతర వాహనాలు రాకపోవడంతో ఎడ్లబండిలో వెళ్లాల్సి వస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లు వేయించాలని కోరుతున్నారు.