contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Alluri Dist: కొండ చర్యలు విరిగిపడి నలుగురు గల్లంతు .. ఒకరు మృతి

  • సహాయక చర్యలకు ఆదేశించిన ఐటీడీఏ పీవో,ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు, అల్లూరి జిల్లా కలెక్టర్ ఎస్.దినేష్ కుమార్.
  • సహాయక చర్యల్లో పాల్గొన్న గూడెం కొత్త వీధి పోలీసుల,రెవిన్యూ, ఫారెస్ట్ బృందం
  • వైద్య సహాయం కోసం వైద్య సిబ్బందినీ,అంబులెన్స్ లను అందుబాటులో ఉంచిన వైద్యశాఖ
  •  చట్రపల్లికి వెళ్లేందుకు బయలుదేరిన వైద్య పోలీసు రెవెన్యూ రెస్క్యూ టీం లకు కొండ మార్గాల్లో వరదలు కాలువలతో తీవ్ర ఇబ్బందులు
  •  జీ.కే వీధి నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెట్రపల్లి కి వెళ్లేందుకు మార్గం మధ్యలో అంతర్ రాష్ట్ర రహదారి నాలుగు చోట్ల కొండ చర్యలు విరిగిపడి రహదారి కప్పబడిపోయింది తీసేందుకు ప్రయత్నం చేస్తూనే వెళ్లలేని ఐటీడీఏ పీవో వి అభిషేక్
  • గ్రామంలో 6 ఇల్లు పూర్తి గా ధ్వంసం, పాక్షికంగా 21 ఇల్లు,మేకలు 70, ఆవులు 10, కోళ్లు 30,
  • అల్లూరి జిల్లా “చట్రాపల్లి” గ్రామంలో కొండ చరియలు విరిగిపడి ఒకరు మృతి!
  • ముగ్గురికి తీవ్ర గాయాలు. మరికొంతమంది గల్లంతు? గుర్తించి ఆసుపత్రిలో చేర్పు

 

అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు గూడెం కొత్త వీధి మండలం గాలికొండ గ్రామపంచాయతీ పరిధిలోని చట్రాపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండ చరియలు గ్రామంపై విరుచుకు పడడంతో ఒక మహిళ మృతి చెందక మరో ముగ్గురికి తీవ్ర గాయాలు తగిలాయి. గత కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఆదివారం ఉదయం నుండి అల్లూరి జిల్లా గూడెం కొత్త వీధి మండలంలో కుంభవృష్టి వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారిగా చట్రా పల్లి గ్రామం పై సమీప కొండల నుండి భారీ ఎత్తున నీరు రాళ్లు దొర్లుకొని వచ్చి గ్రామంలోని తీవ్ర భయానక వాతావరణంలో సృష్టించింది ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడడంతో చట్రాపల్లి గ్రామం లో గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు సమీప కొండ నుండి నీరు బండరాళ్లు బురద మట్టి గ్రామం పై విరుచుకుపడడంతో గ్రామానికి చెందిన కొర్ర కుమారి (20) అనే మహిళ మృతి చెందగా ఆమెతోపాటు కొర్ర సుమిత్ర (18) కుర్ర సుబ్బారావు (25) కుర్ర పండన్న (60) కొండ చరియలు తాకిడికి కొట్టుకుపోయారు అయితే సంఘటన జరిగిన వెంటనే స్పందించిన చట్రాపల్లి గ్రామస్తులు కొట్టుకుపోయిన ముగ్గురిని కాపాడగా ఒక మహిళ మాత్రం మృతి చెందింది.

దీంతో ఈ విషయాన్ని అల్లూరి జిల్లా అధికారులకు సమాచారం అందించడంతో అధికార యంత్రాంగం ఆ ప్రాంతానికి బయలుదేరింది. అయితే ఎడతెరిపిలేని వర్షం కారణంగా సంఘటన ప్రాంతానికి బయలుదేరిన పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అభిషేకు లంకపాకలు అనే గ్రామానికి వెళ్లి అక్కడ ప్రధాన రహదారికి చెందిన మూడు బ్రిడ్జిలు వర్షాల తాకిడికి కొట్టుకుపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి వెళ్లే పరిస్థితి నెలకొంది అయితే సప్పర్ల సచివాలయం లో అందుబాటులో ఉన్న అధికారులను సకాలంలో ఆ ప్రాంతంలో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు చట్రాపల్లి గ్రామస్తులను దగ్గరలోని సప్పర్ల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలకు తరలించాలని ఆదేశించారు. గాయపడిన వారిని సకాలంలో సప్పర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు అయితే ప్రస్తుతం వారిని బయట ప్రాంతాలకు తీసుకువెళ్లడానికి అన్ని ప్రాంతాల నుండి రహదారి మార్గాలు వర్షాల తాకిడికి మూసుకుపోవడంతో అక్కడే వైద్య సేవలు అందిస్తున్నారు.

మృతి చెందిన కుమారి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా

-జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్.

గూడెం కొత్త వీధి మండలం గాలికొండ గ్రామపంచాయతీ చట్రాపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన కుమారి కుటుంబానికి 5 లక్షల రూపాయల జాతీయ విపత్తు పథకం కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొండల సమీపంలో ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని వర్షాల తాకిడికి కొండ చర్యలు వీడికి పడే అవకాశం అధికంగా ఉందని సురక్షిత ప్రాంతాలకు తరలిరావాలని కలెక్టర్ దినేష్ కుమార్ కోరారు.కాగా చట్రాపల్లి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడిన సంఘటనపై వెంటనే అధికారి యంత్రాంగం స్పందించి సకాలంలో చర్యలు చేపట్టడం జరిగిందని అల్లూరి జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :