- అటు అంబులెన్స్ కి ఇటు జీపుకి మధ్య తాడు కట్టి గడ్డ దాటింపు!
- సాహసం చేసిన మొండిగడ్డ గ్రామస్తులు సకాలంలో ఆసుపత్రికి తరలింపు.
అల్లూరి జిల్లా, గూడెం కొత్త వీధి :గూడెం కొత్త వీధి మండలంలో గత రెండు రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ ఎత్తున కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో గూడెం కొత్త వీధి మండలం మొండిగడ్డ గ్రామానికి చెందిన కందుల శాంతికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి అయితే ఆ గ్రామానికి సమీపంలో ఉన్న జెర్రెల వంతెన వద్ద వాగు తీవ్ర ప్రమాదక స్థాయిలో ప్రవహిస్తుంది వాగు దాటితే గాని గర్భిణీ స్త్రీని ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్ళడానికి కుదరదు అయితే వాగు వైపు అంబులెన్స్ వచ్చి ఉన్న వాగు దాటించడానికి ఏమి చేయాలో తెలియని పరిస్థితి అయితే గ్రామస్తులు అందరూ కలిసికట్టుగా అటువైపు అంబులెన్స్ కి ఇటువైపు జీపుకి తాడు కట్టి అతి కష్టం మీద గర్భిణీ స్త్రీ కందుల శాంతిని వాగు దాటించి చింతపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు మారుమూల ప్రాంతంలో ప్రజలు సరైన బ్రిడ్జిలు లేక వాగులపై ప్రమాదకర పరిస్థితులలో ఎలా ప్రయాణం చేస్తున్నారో అన్నది ఈ సంఘటన బట్టి తెలుస్తుంది ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని మారుమూల ప్రాంతాలలో వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.