అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్తవీధి మండలం: జీ.కే.వీధి మండలనికి సంబంధించిన చింతపల్లి నుండి చౌడుపల్లి మీదుగా పశువులబంధ, కొత్తపాలెం, విరవరం,వాకపల్లి,వంతడపల్లి,జర్రెల,మొండిగెడ్డ ప్రధాన గ్రామాలు వీటికి ఆనుకొని 50 గ్రామాలు వున్నాయి.ఈ ప్రధాన రహదారి మార్గాన్ని ఆధారపడి ఆయా గ్రామాల వారు జీవిస్తున్నారు.చింతపల్లి నుండి మొండిగెడ్డకు సుమారుగా 22 కీమీ రహదారి నిర్మించడానికి అధికారులకు ఏళ్లు గడుస్తున్నా రోడ్లు వేయాలని ఆలోచన అధికారులు కలగలేదని మారుమూల గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జర్రెల మరియు మొండిగెడ్డ ఈ రెండు పంచాయతీ లకు ఉన్నఇరువైపులా గ్రామాలు సుమారుగా 34 గ్రామాలు ఉన్నాయి.కాని పూర్వం నుంచి ఇప్పటికి ఈ ప్రధాన రహధారి పెద్ద గుంతలు పడుతూ అద్వానంగా మారుతూనే ఉంది. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతూ అనేక ప్రమాదాలు జరిగిన అధికారులకు కనిపించట్లేదని అంటున్నారు. జర్రెలలో ఒక ప్రభుత్వ హాస్పిటల్,స్కూల్ ఉంది, ఆస్పత్రి నుంచి సీరియస్ కేసు వస్తే చింతపల్లి తరలించాలి ఎన్నో ఇబ్బందులతో అంబులెన్సులు వెళ్తూ ఉంటాయి.ఈ రహదారి రోడ్డునీ అనుకొని వంచుల,జర్రెల,మొండిగెడ్డ,ఈ మూడు పంచాయితీలకు సంబందించిఉంది.అలాగా మూడుపంచాయితీలలో సుమారుగా 50 గ్రామాలకు పైబడి ఉంన్నాయి కాని ఈ రహదారి రోడ్డు ను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందో ఎటుచూస్తుందో తెలియని పరిస్థితిగా మారిందని గిరిజనులు వాపోతున్నారు.చాలామంది రాజకీయనేతలు మీడియా ముందుకొచ్చి అభివృద్ధి కోసం చెబుతుంటారు.అభివృద్ది అంటే డబ్బులు ఇవ్వటం కాదు,రోడ్లు వేసి 50 గ్రాములు ప్రజల బాధలు తీర్చేది అభివృద్ది అనీ నాయకులకు ఎప్పుడు అర్థమోవుతుందో జర్రిల కొత్తూరు గ్రామస్థులు తీవ్ర అషహణం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైన అదికారులు కళ్ళు తెరిచి 50 గ్రామాలలోని నివసిస్తున్న మారుమూల గ్రామాలకు ఈ రోడ్డు ఎంత అవసరమో గుర్తించి మంజూరు చేసి న్యాయం చేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.