- గ్రామాల్లో దేవాలయాల ఏర్పాటుకు రూ. పదిలక్షలు చొప్పున గ్రాంట్ విడుదల: -జడ్పీటీసీ రేగం మత్యలింగం
అల్లూరి జిల్లా, హుకుంపేట,ది రిపోర్టర్ :ఈ రోజు అల్లూరి జిల్లా,హుకుంపేట మండలం పరిధిలో గల అండిబ పంచాయతీ అడపరాయి, బంగారుబుడే, భీమవరం పంచాయితీ రామచంద్రపురం, రంగాసీల పంచాయితీ ఇరుకువలస గ్రామాలలో హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్యలింగంతో పాటు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ షేక్ సైదు లు పర్యటించారు. ఈ సందర్బంగా జడ్పీటీసీ మత్యలింగం మాట్లా డుతూ…ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో దేవాలయాలు ఏర్పాటుకు రూ.10లక్షలు చొప్పున గ్రాంటు విడుదల చేసిందని వాటి నిర్మాణాలకు స్థల పరిశీలన చేయటం జరిగిందన్నారు, నిర్మాణాలు పూర్తి అయిన దేవాలయాలకు ఆలయ కమిటీ ఖాతాల్లో నిధులు జమ చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొర్ర మొద్దు, గెమ్మెలి అప్పారావు,చంటి, వెంకట్, ఈశ్వరరావు,తదితరులు పాల్గోన్నారు.