అల్లూరి జిల్లా, హుకుంపేట : మండలంలోని తీగల వలస పంచాయతి ఆమూరు గడ్డె వద్ద జెసిబి లతో తవ్వుకుంటూ పెద్ద బెంజ్లర్లతో లోడ్ తరలిస్తుండడంతో బుధవారం స్థానిక గిరిజనులు అడ్డుకున్నారు. స్థానిక గిరిజనులు అక్రమ ఇసుక నిలుపుదల చేయాలని అనేకమార్ల అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకోవడంతో బుధవారం గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు వల్ల భూగర్భ జలాలు అడగండి పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వెంటనే అధికారులు స్పందించి అక్రమ ఇసుక నిలుపుదల చేయాలని గ్రామస్తులు కోరారు. ఎద్దేచగా జేసీబీ లతో తవ్వకాలు లారీలతో ఇసుక అక్రమ రవాణా హుకుంపేట మండలంలో పంచాయతీ ఆమూరు గడ్డె వద్ద అక్రమంగా ఇసుక రవాణా జోరుగా సాగుతున్నాయి. కాంట్రాక్టర్లు,ఇసుక వ్యాపారుల అక్రమ దందాలతో హుకుంపేట మండలం అమూరు గెడ్డలో జేసీబీ లతో గెడ్డలో ఇసుక , తవ్వడం నిల్వ చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తుండగా స్ధానిక గ్రామ ప్రజలు అడ్డగించారు. రోడ్డు, భవనాల తదితర అభివృద్ధి నిర్మాణ పనుల పేరు చెబుతూ వాగులు గెడ్డలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ,ఇసుక రవాణా చేపడుతూ అక్రమార్కులు లక్షలు గడిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.మండలంలో ప్రధాన గెడ్డ అయిన కమయ్యపేట నుండి అమూరు గ్రామాల్లో నుండి ఇసుక అక్రమ రవాణ దందా విచ్చలవిడిగా జరుగుతున్నదని స్థానిక ప్రజలు చెబుతున్నారు.అక్రమ దందాలను అరికట్టాల్సిన సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పలు గ్రామాల్లో చిన్న చిన్న కుంటలలో మట్టి తవ్వకాలు, హుకుంపేట మండలం నుండి ఇసుక రవాణ జోరుగా సాగుతున్నాయి. రహదారుల నిర్మాణాలకు ఇసుక అవసరం కావడంతో వాటి కాంట్రాక్టర్లు యథేచ్ఛగా తవ్వకాలు చేస్తున్నారు. అక్రమ ఇసుక రమణ వెంటనే నిలుపుదల చేయాలని లేని పక్షంలో గ్రామస్తులతో పోరాటం చేస్తామని వారు అన్నారు.