అల్లూరు జిల్లా- అనంతగిరి మండలం : మండలంలోని కివర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంబందించిన పనులు జోరుగా జరుగుతున్నాయి. మండలంలోని జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా ఈ ఏడాది వంద రోజులు పని దినాలు ప్రభుత్వం కల్పించటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఉపాధి హామీ ఏపిఓ అర్జున్ తెలిపారు.అలాగే సోమవారం నాడు టెంకల వలస గ్రామానికి చెందిన జన్ని కొండబాబు పొలంలో గిరిజన ఉపాధి వేతనదారులు భూమి చదును పనులు చేస్తుండగా నీడ్స్ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు,సిసిఆర్ జిల్లా సెక్రటరీ, జై భారత్ ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.లక్ష్మణ్ పని ప్రదేశంలో సందర్శించి కూలీల సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసు కున్నారు.అనంతరం ఉపాధి కూలీలతో మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతాలకు వలసల ద్వారా కూలీ పనులకు వెళ్లకుండా సొంత గ్రామంలో ఉపాధి హామీ పధకం ద్వారా వంద రోజులు పనిని అందరూ సద్వినియోగం చేసుకొని తద్వారా గ్రామాల్లో స్థిర ఆస్తులు పెంచుకుంటూ, భూగర్భ జలాలు పెంపోదిం చేదుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని ఉపాధి హామీ పధకాన్ని గిరిజన రైతులు అందరూ సద్వినియోగం కోవాలని తెలియజేసారు. ఈ సందర్బంగా ఉపాధి వేతనదారులు మాట్లాడుతూ… ఇప్పటికే నాలుగు వరాలు పని చేశామని వారానికి ఒకొక్కరికి పదిహేను వందలు పైబడి వేతనాలు తమ,తమ ఖాతాలలో జమ అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు, అలాగే ఎండ చాలా ఎక్కువగా వుందని నీడ, మంచినీళ్లు ఏర్పాటు చేయాలనీ,గునపం, పారలు అందించాలని వారు ఈ సందర్బంగా సంబందింత సిబ్బంది కోరారు.