మెదక్ జిల్లా శివ్వంపేట మండలం: కొంతాన్ పల్లి లో సోమవారం అంబేడ్కర్ విగ్రహం చేతులు గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేశాడు. విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దళితుల మనోభావాలను దెబ్బతినేలా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అమానుషం, దారుణమని మండిపడుతున్నారు. దోషులు ఎంతటి వారైనా గంటల్లో అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయం పై అధికారులు స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామని.. అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు, తూప్రాన్ మున్సిపల్ కౌన్సిలర్ మామిడి వెంకటేష్, కృష్ణ హెచ్చెరించారు.