- టీడీపీ నేతలతో కలసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
- భవిష్యత్ తరాలు అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపు
చిత్తూరు జిల్లా , పలమనేరులో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని పద్మశ్రీ సర్కిల్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు భవిష్యత్ తరాలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగరాజు, టిడిపి నాయకులు కుట్టి,గిరిబాబు, శ్రీధర్, మదన్,ఖాజా, చిన్ని,కిరణ్, సుబ్బు లతో గంగవరం మండల పార్టీ అధ్యక్షులు సోమశేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు .