బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి బాబా సాహెబ్ – రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్
సిద్ధిపేట జిల్లా : మనకొండూర్ నియోజకవర్గనికి చెందినబెజ్జంకి మండలంలోని దాచారం గ్రామములో శనివారం రోజున రాష్ట్ర సాంస్కృతిక సారథి స్థానిక ఎమ్మెల్యే డా:రసమయి బాలకిషన్ ,కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపెల్లి వినోద్ కుమార్ తో కలిసి అంబేద్కర్ విగ్రహం, తో పాటు అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు నడుం బిగించాలి,అప్పుడే ఆయన కోరుకున్న వివక్ష లేని సమాజ నిర్మాణము జరుగుతుంది అని ,ఎమ్మెల్యే రసమయి అన్నారు,బి,వినోద్ కుమార్ అంబేద్కర్ బడుగుల ,బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేశారు అనీ కొనియాడారు,ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పెంటమీది శ్రీనివాస్,ఎంపీటీసీ రాజు,ఎంపీపీ,లింగాల నిర్మల లక్ష్మీన్,జడ్పీటీసీ కనగండ్ల కవిత తిరుపతి,బి,ఆర్,స్ చేరికల కమిటీ అధ్యక్షుడు చింతకింది శ్రీనివాస్ గుప్తా,సోషల్ మీడియా ఇంచార్జ్ ఎల శేఖర్ బాబు,కార్యకర్తలు పాల్గొన్నారు.