తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఆధ్వర్యంలో బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతి నీ పురస్కరించుకుని టీ జి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దొడ్ల.వెంకట్ సదాశివపేట పట్టణం లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ…..అంబేద్కర్ తన చిన్నతనంలో అనుభవించిన అంటరానితనాన్ని కుల వివక్ష రూపుమాపాలని,కేవలం చదువుతూనే సాధ్యమని భావించి ఎన్నో అవమానాలను ఎదురుకోని ఎన్నో డిగ్రీలు పొంది ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన దేవుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. బలహీన వర్గాల బ్రతుకులు మారాలని రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేేేక చట్టాలను పొందపరచిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టి జి ఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్త బస్వరాజ్ పాటిల్, రాష్ట్రర ప్రధాన కార్యదర్శి సురేష్, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఫయాజ్, రాష్ట్ర నాయకులు వీరేష్ పాటిల్, జిల్లా మీడియా సెల్ ఇంఛార్జి కే. విరేశ్, జిల్లా నాయకులు ఆంజనేయులు, పంచలింగాల రాజు, తదితరులు పాల్గొన్నానారు.