- రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించిన జనసేన నాయకులు..
తిరుపతి: ప్రపంచ మేధావి.., భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని తిరుపతి జనసేన పార్టీ నాయకులు అన్నారు. ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తిరుపతి జనసేన పార్టీ నాయకులు శుక్రవారం నగరంలోని బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించి ఆ మహనీయుని స్ఫూర్తిని కొనియాడారు..
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషి వల్లే ఎసి,ఎస్టీ, బీసీలు, మైనారిటీలు రాజ్యాంగ ఫలాలు అందుకుంటున్నారని తెలిపారు. అంబేద్కర్ సిద్ధాంతాలకు కట్టుబడిన ఏకైక వ్యక్తి తమ అధినేత పవన్ కళ్యాణ్ అని గుర్తు చేసారు. ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు పవన్ పాటు పడుతున్నారని వారు చెప్పుకొచ్చారు, అంబేద్కర్ చూపీన బాటలోనే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు నడవాలని తమ అధినేత సూచించిన విషయాన్ని జనసైనికులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. భవిష్యత్తులో కూడా అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతుందని ఉద్ఘాటించారు. తాము కూడా ప్రపంచ మేధావి అంబేద్కర్ స్ఫూర్తితో సమాజ సేవకు అంకితం అవుతామన్నారు..
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి , నాయకులు బాబ్జి, కీర్తన, లావణ్య, కొండ రాజమోహన్, హేమ కుమార్, హిమవంత్, కృష్ణ, హేమంత్, బాలాజీ, సాయికుమార్, పురుషోత్తం రాయల్, రాజేష్, పురుషోత్తం, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.