- అంబేద్కర్ సాక్షిగా టి సేవ్ లోగోను మరోసారి ఆవిష్కరణ
నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ అర్బన్; ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబ సాహెబ్ అంబెడ్కర్ గారి 132వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో నిజమాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద గల అంబెడ్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అంబెడ్కర్ సాక్షిగా టీ సేవ్ లోగోను మరోసారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్ బుస్సాపూర్ శంకర్ మాట్లాడుతూ బానిస సంకెళ్ళను తెంచిన ఒక గొప్ప అగ్నిపర్వతం , ముక్కుసుటి వ్యక్తిత్వంతో కులాహంకారమును ఎదురిస్తూ రేపటి మనుగడకు పునాది వేసి ధైర్యాన్ని , పోరాటాన్ని పరిచయం చేసిన ఒక నవ భారత నిర్మాత రాజ్యాంగ ప్రధాత అంబెడ్కర్ అని అన్నారు.
కొన్ని కోట్ల జీవితాల్లో వెలుగులు నింపిన జ్ఞాన సూరీడు ,బోదించు , సమీకరించు , పోరాడు అని నేర్పిన బాట సారి ,జగతికి మూలం , మనుగడకు ఆధారం, భవితరాలకు ఆదర్శం డా బి ఆర్ అంబెడ్కర్ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షులు కస్తూరి ప్రవీణ్ , నగర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ , ఎస్ టీ విభాగం జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ , యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అంకార్ గణేష్ , బీసీ విభగం జిల్లా ఉపాధ్యక్షులు హనుమయ్య , నగర బీసీ విభాగం అధ్యక్షులు కారంపూరి రవి , నగర యువజన విభాగం అధ్యక్షులు సంతోష్ , సీనియర్ నాయకులు దినేష్ , 10వ డివిజన్ అధ్యక్షులు పాండు , మహిళ నాయకులు రేఖ , సౌమ్య తదితరులు పాల్గొన్నారు.