రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం 17వ వార్డు పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అను నిత్యం అనుక్షణం అట్టడుగు వర్గాల సంక్షేమానికి కోసం కృషి చేసిన మహోన్నత నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, ఆ అవార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.