తిరుపతి: రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్సు అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు. డీఎస్పీ మురళీధర్ నేతృత్వంలో టాస్క్ ఫోర్సు కార్యాలయంలో నివాళులు అర్పించారు. డీఎస్పీ మురళీధర్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే మన దేశంలో అమలు అవుతోందని తెలిపారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఎస్ఐ మోహన్ నాయక్, ఎఫ్ఆర్ఓలు మురళీకృష్ణ, ప్రేమ ఆర్ఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.