తిరుపతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు కోరారు. ఎపిఎస్ పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ (టెక్నికల్, హెచ్ఆర్ డి) ఎస్.వి.ఎస్. సుబ్బరాజు, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్, ఐటి) కె. శివప్రసాద రెడ్డిలు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అందరికీ ఆదర్శవంతంగా వుండడంతోపాటు ప్రపంచ దేశాల్లో అత్యున్నత రాజ్యాంగంగా నిలిచిందన్నారు. సమాజంలో వివక్షను నిర్మూలించేందుకు అంబేద్కర్ పోరాటం సాగించారని తెలిపారు. సంస్థ ఉద్యోగులందరూ ఆయనఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్లు డి.ఎస్. వరకుమార్, వై. లక్ష్మీసరసయ్య, డి.వి. చలపతి, పీ. అయూబ్ ఖాన్, కె. గురవయ్య, కె.ఆర్.ఎస్. ధర్మజ్ఞాని, జనరల్ మేనేజర్లు ఆదిశేషయ్య, మురళి, చంద్రశేఖర్ రావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్మికులకు దుస్తుల వితరణ:
ఎపిఎస్ పిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎపిఎస్ఇబి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరెక్టర్లు ఎన్విఎస్ సుబ్బరాజు, కె. శివప్రసాద రెడ్డి చేతుల మీదుగా కార్పొరేట్ కార్యాలయంలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి. జయరామ్, కోశాధికారి శంకరయ్య, లైజన్ ఆఫీసర్ పి. మురళి, కార్పొరేట్ ఆఫీస్ యూనిట్ నాయకుడు జి. అంజనప్ప, తిరుపతి సర్కిల్ నాయకులు సుబ్రమణ్యం, జనార్ధన్ రావు తదితరులు పాల్గొన్నారు.